ETV Bharat / state

Smart life device: స్మార్ట్‌లైఫ్‌... విద్యుత్​ అవస్థల నుంచి రక్షించే పరికరం - Smart life device

Smart life device: సామాన్యుల నుంచి సంపన్నుల వరకు! రైతుల నుంచి ఉద్యోగుల వరకు అందరిదీ నిత్యం విరామం లేని పోరాటమే. ఈ హడావుడి జీవితాల్లో.. విద్యుత్‌ వాడకం పెరగగా... వృథా కూడా ఎక్కువే అవుతోంది. దీనికితోడు విద్యుత్‌ ఛార్జీల బిల్లులు మోత మోగిస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు ఈ యువకులు.. అంకుర సంస్థను స్థాపించి స్మార్ట్‌లైఫ్‌ పేరిట ఓ పరికరం రూపొందించారు. దీని ద్వారా కరెంటు వృథా అరికట్టడంతో పాటు సాధారణ పనుల సమయాన్ని సులువు చేస్తున్నారు కృష్ణా జిల్లా యువకులు.

Smart life device
స్మార్ట్‌లైఫ్‌
author img

By

Published : Sep 15, 2022, 7:40 AM IST

స్మార్ట్‌లైఫ్‌

Smart Life device: మనిషి నిద్రలేచినప్పటి నుంచి ఉరుకుల పరుగుల జీవితం. ఈ క్రమంలో కొన్ని పనులు సక్రమంగా చేసినా.. మరికొన్ని మర్చిపోతుంటాం. వాటికోసం ఎవరైనా తోడుగా ఉంటే బాగుండు అని అనుకుంటుంటాం. ఈ యువకులు దానికోసం మనిషి ఎందుకు... మేం చేసిన ఈ పరికరం సరి పోతుందంటున్నారు.

స్మార్ట్‌లైఫ్‌. ఇదో చిన్నపాటి పరికరం. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలానికి చెందిన ఇంజనీరింగ్‌, డిగ్రీ విద్యార్ధులు, పట్టభధ్రులు దీన్ని తీర్చిదిద్దారు. కొన్నేళ్ల నుంచి డ్రోన్‌ సాంకేతికపై పరిశోధనలు చేస్తూ రైతులకు అవసరమైన పరికరాలు రూపొందించి అందిస్తోన్న కమల నితీష్‌ అనే యువకుడు స్మార్ట్‌లైఫ్‌ సాధన రూపకల్పనలో ఓ అడుగు ముందుకేశాడు. దీని లోటుపాట్లు మిత్రులతో చర్చించి తుదిరూపు తీసుకొచ్చారు.

"మేము ఏరో డ్రోన్​ టెక్నాజీస్​ అనేది 2019లో ప్రారంభించాం. అంటే మేము అగ్రికల్చర్​ డ్రోన్స్​ లాంటి వాటిని డీల్​ చేస్తుంటాం. తర్వాత 2020 నుంచి హోం ఆటోమిషిన్స్​ మీద క్యూరియాసిటీ ఉండి వాటిపై ప్రయోగాలు చేశాం. 2020 నుంచి ప్రయత్నిస్తే చివరి ఆరునెలల్లో మేము హోం ఆటోమిషిన్స్​ తయారు చేశాం. మేము తయారు చేసింది హోం ఆటోమిషిన్స్​ వైఫై స్విచ్​ను." -కమల నితీష్‌, పరికరం రూపకర్త

స్మార్ట్‌లైఫ్‌ పరికరం ద్వారా ఇళ్లు, కార్యాలయాలు, అతిథి గృహాల్లోని అన్ని విద్యుత్తు ఉపకరణాలను వాటికి దగ్గరకు వెళ్లకుండానే నియంత్రించవచ్చు. ఈ పరికరాన్ని స్విచ్‌బోర్డులో అమరిస్తే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉన్న చోట నుంచే అదుపు చేయవచ్చు. ఇందుకు స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ రూపొందించిన యవకులు.... లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, టీవీ, గ్రీజర్‌, మోటారు తదితర విద్యుత్తు ఉకరణాలను కేవలం స్మార్ట్‌ఫోన్‌తో నిర్వహించుకోవచ్చు అంటున్నారు.

"ఇది కాంపాక్ట్​ డిజైన్​ ఉంటుంది. దీన్ని ఇంట్లో ఉన్న స్విచ్​ బోర్డులో అయినా ఇంటిగ్రేట్​ చేసుకోవచ్చు. దీని ద్వారా ఇంట్లో ఉన్న సాధారణ స్విచ్​లను స్మార్ట్​ స్విచ్​ల లాగా కన్వర్ట్​ చేసుకోవచ్చు. దీని విలువ రూ.2 వేలు ఉంటుంది. దీనికి స్మార్ట్​లైఫ్​ అనే ఒక ఆండ్రాయిడ్​ యాప్​ ఇస్తాం. దీంట్లో ఉన్న మేజర్​ ఆప్షన్​ ఏంటంటే.. జాబ్​ చేసే వాళ్లు లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, టీవీ, గ్రీజర్‌, మోటారు తదితర విద్యుత్తు ఉకరణాలను కేవలం స్మార్ట్‌ఫోన్‌తో నిర్వహించుకోవచ్చు" -కమల నితీష్‌, పరికరం రూపకర్త

ఈ స్మార్ట్‌లైఫ్‌ డివైస్‌ను.. అలెక్సా, గూగుల్‌ అసిస్టెంట్స్‌కు అనుసంధానం చేయడం ద్వారా... నోటి మాటతో అన్ని కరెంటు పరికరాలను పనిచేయించొచ్చు. లేదంటే నిలిపివేయొచ్చు. అలాగే ఏ విద్యుత్తు ఉపకరణం ఎప్పుడు పనిచేయాలి? ఎప్పుడు ఆపివేయాలి? అనేది సమయానుకూలంగా కూడా వేళలను విభజించుకుని ప్రణాళిక ప్రకారం వినియోగంలోకి తీసుకురావొచ్చు.

ఏ విద్యుత్తు పరికరం ఏ సమయంలో ఆటోమేటిక్‌గా ఆన్‌ కావాలి... మళ్లీ ఏ సమయంలో ఆటోమోటిక్‌గా ఆఫ్‌ కావాలి.. ఎంత సేపు పనిచేసి ఉండాలి? వంటి అన్ని వివరాలను ముందుగా స్మార్ట్‌ఫోన్‌లోని స్మార్ట్‌లైఫ్‌ యాప్‌లో నమోదు చేసి సెట్‌ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌లైఫ్‌ డివైస్‌ను 2 బెడ్‌రూములు, ఓక హాల్‌, కిచెన్‌ ఉన్న ఇంటికి అమర్చుకోడానికి 10వేల రూపాయల లోపే ఖర్చు అవుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు.

"ఈ పరికరం మొత్తం క్లౌడ్​ టెక్నాలజీ మీద ఆధార పడి పనిచేస్తుంది. యాప్​ డౌన్​లోడ్​ చేసుకోవాలి. దీనికి ఇంట్లో ఒక వైఫై ఉండాలి. వైఫై ద్వారా ఇవన్నీ కనెక్ట్​ అయి ఉంటాయి. బయటికి వెళ్లినప్పుడు మొబైల్​ డేటా ఉంటుంది కాబట్టి క్లౌడ్​ ద్వారా ఎక్కడ ఉన్నా ఆ ఇంటిని ఆపరేట్​ చేసుకోవచ్చు." -కమల నితీష్‌, పరికరం రూపకర్త

ఇలానే రొయ్యల చెరువుల్లో ఏరియేటర్స్‌ నియంత్రణకు మరో పరికరాన్ని రూపొందించి.. కేంద్ర పరిశోధన సంస్థలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఫలితాలు బావుండటంతో తక్కువ ధరకే ఆక్వా రైతుల అందించేలా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే చేపలు, రొయ్యల చెరువుల్లోని నీటి నాణ్యత, అందులోని ఖనిజాల స్థితిగతులనూ ఈ పరికరం సహాయంతో తెలుసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకునే వీలుందని అంటున్నారు.

"అక్వా రైతుల కోసం ఇలానే రొయ్యల చెరువుల్లో ఏరియేటర్స్‌ నియంత్రణకు మరో పరికరాన్ని రూపొందించి.. కేంద్ర పరిశోధన సంస్థలో ప్రయోగాత్మకంగా పరిశీలించాం ఫలితాలు బావుండటం తక్కువ ధరకే ఆక్వా రైతుల అందించేలా అభివృద్ధి చేస్తున్నాం. చేపలు, రొయ్యల చెరువుల్లోని నీటి నాణ్యత, అందులోని ఖనిజాల స్థితిగతులనూ ఈ పరికరం సహాయంతో తెలుసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకునే వీలుంది." -దేశినాయుడు, బీఎస్సీ విద్యార్థి కృష్ణా జిల్లా

మిత్రులతో కలిసి అంకుర సంస్థలో పనిచేస్తుండడం... మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు అవసరమైన ఆధునిక పరికరాలను తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ఈ యువ బృందం సభ్యులు చెబుతున్నా.

బహిరంగ మార్కెట్లోని ఆటోమేటిక్‌ ఉపకరణాల ధర కంటే తక్కువకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం... స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు యువకులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.