ఇతర దేశాల నుంచి వచ్చిన వారు హోమ్ క్వారంటైన్ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో ఐసోలేషన్లో ఉండి తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు స్పష్టం చేశారు. క్వారంటైన్ నుంచి తప్పించుకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అంతకుమందు విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు హోమ్ క్వారంటైన్లో కొద్ది రోజులున్న పిదప ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వీరిపై మైలవరం పోలీసులు కేసులు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: