పటిష్టమైన భద్రత చర్యలతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టేలా జాగ్రత్తలు అనుసరిస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ చెప్పారు. ఎక్కువగా దాడులు జరిగే సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. నిషేధిత గుట్కా వ్యాపారాలకు అడ్డుకట్టవేస్తున్నామని చెప్పారు. ఎక్కువగా ఒరిస్సా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి గుట్కా సరఫరా జరుగుతుందని పోలీసులు గుర్తించగా... డీలర్లు ,విక్రేతలను మొత్తం200 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అంతేగాక బెట్టింగ్,పేకాట వంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇసుక మాఫియాను అరికట్టేలా చర్యలను వేగవంతం చేశామని పేర్కొన్నారు.
ఇదిచూడండి.ప్రపంచకప్ ఫైనల్ టికెట్ ధర 13 లక్షలా!