కృష్ణా జిల్లా పరిధిలో పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో నిబంధనలు కఠినతరం చేశామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అన్నారు . గరికపాడు చెక్ పోస్ట్ వద్ద నిత్యావసర వస్తువుల వాహనాలకు, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిని ఇస్తున్నామని తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో... జిల్లాలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వారికి పునరావాసం కల్పిస్తున్నామన్నారు. హోం క్వారంటైన్లో ఉన్న వారిని ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు వెల్లడించారు. దిల్లీలో సమావేశాలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఇవీ చదవండి...రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు