కొవిడ్ బాధితులకు కొంతమంది ఆర్ఎంపీ వైద్యులు స్టైరాయిడ్స్ ఇస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని డీఎంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య అధికారులతో బ్లాక్ ఫంగస్ రోగులకు వైద్య సేవలు అందించేందుకు తీసుకోవలసిన అంశాలపై చర్చించారు.
కరోనా బాధితులు సొంతంగా స్టెరాయిడ్స్ వాడరాదని సూచించారు. అంతేకాక కొవిడ్ నుంచి కోలుకున్నాక రక్తంలో షుగర్ లెవెల్స్ ను జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలన్నారు. షుగర్ లెవెల్స్ అతిగా పెరగకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ తెలిపారు. మధుమేహం ఉన్న కొవిడ్ పేషంట్లకు షుగర్ లెవెల్స్ నియంత్రణ చేయకుండా, స్టెరాయిడ్స్ మందులు ఇవ్వడం ద్వారా బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. జీజీహెఎచ్ లో బ్లాక్ ఫంగస్ బాధితులకు వైద్యం అందించేందుకు 25 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండీ.. తెదేపా మాక్ అసెంబ్లీ నాటకాలను తలపించాయి: పేర్ని నాని