ETV Bharat / state

కల్మషం లేని మనసులు.. కాలుష్యం లేని దివాళీ.. ఈ చిన్నారులను ఫాలో కావాల్సిందే..! - krishna district updates

దీపావళి అంటే టపాసుల మోత మోగిపోతుంది. దీనివల్ల జరిగే గాలి, శబ్ద కాలుష్యానికి అంతే ఉండదు. కానీ.. అక్కడి చిన్నారులు మాత్రం పర్యావరణానికి హాని జరగకుండా వెలుగుల పండుగ జరుపుకుంటారు! అలాగని.. ఎలాంటి సందడీ ఉండదనుకుంటే పొరపాటే. దీపావళి ముందు నుంచి నాగులచవితి వరకూ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ధ్వని కాలుష్యం లేకుండా దీపావళి పండుగ (diwali celebrations)చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న కృష్ణా జిల్లా చిన్నారులపై కథనం..

diwali celebrations
diwali celebrations
author img

By

Published : Nov 4, 2021, 4:46 PM IST

Updated : Nov 4, 2021, 4:52 PM IST

కృష్ణా జిల్లా(Krishna District) మోపిదేవి మండలం కోసూరువారిపాలెం గ్రామం దీపావళి ప్రత్యేకత(diwali celebrations)ను చాటుకుంటోంది. ఇక్కడి చిన్నారులు మతాబులు, చిచ్చుబుడ్లు కావాలని తల్లిదండ్రులను అడగరు. టపాసులు పేల్చితే పర్యావరణం కాలుష్యం అవుతుందని... అనవసర ధ్వని కాలుష్యం ఎందుకని భావించి వాటికయ్యే డబ్బు దాచుకుని పొదుపుచేసుకుంటున్నారు.

అదే సమయంలో దీపావళి(diwali)ని పాత పద్ధతిలోనే సరికొత్తగా చేసుకుంటున్నారు. దీపావళికి 10 రోజుల ముందే రంపం పొట్టు, తాటి గులకలు కాల్చి వాటిని ఎండబెట్టి పొడి చేస్తారు. ఆ పొడిని గుడ్డలో గుండ్రంగా చుట్టి దానికి ఆవుపేడ రాసి ఎండలో 3 రోజులు ఎండబెడతారు. తాటిచెట్టు కమ్మను చీల్చి ఆ పొట్లాన్ని దానిలో ఉంచి పైన తాడుకట్టి వేగంగా తిప్పడంతో చుట్టూ నిప్పు రవ్వలు చిమ్ముతూ నిప్పుల వాన కురుస్తుంది. నిప్పుల పూలు వెలుగులు విరజిమ్ముతాయి.

పర్యావరణానికి హాని లేకుండా పండుగ... ఆదర్శంగా నిలుస్తున్న చిన్నారులు

పూర్వకాలంలో...
పూర్వకాలం టపాసులు, రసాయన మందుగుండు లేనప్పుడు గ్రామాల్లో నిప్పుల పూల పొట్లాలు తిప్పుకునేవారు. టపాసులు చాలా తక్కువ సమయంలోనే కాలిపోతాయి. కానీ.. ఇవి గంట వరకు నిప్పురవ్వలు చిమ్ముతూనే ఉంటాయి. ఇలా తిప్పేటప్పుడు నిప్పురవ్వలు మనిషిపై పడినా పెద్దగా ప్రమాదమేమీ ఉండదు. ఇలా తిప్పడం వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం తమ సొంతమవుతుందని చిన్నారులు అంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్న ఇలాంటి గ్రామాలను ప్రభుత్వాలు గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

దీపావళి అంటేనే దివ్వెల పండుగ

Last Updated : Nov 4, 2021, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.