ETV Bharat / state

స్ట్రాంగ్ రూంలోకి వర్షపు నీరు.. బ్యాలెట్ బాక్సులను పరిశీలించిన కలెక్టర్

కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాంటిస్సోరీ పాఠశాలలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు. స్ట్రాంగ్ రూంలోకి వర్షపు నీరు చేరిందని.. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి.. స్టాంగ్ రూంను పరిశీలించేందుకు అనుమతి తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.

author img

By

Published : Jul 17, 2021, 12:52 AM IST

krishna collector j nivaas collcctor visit strong room

మాంటిసోరి స్కూల్​లో భద్రపరిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ బ్యాలెట్ బాక్సులను జిల్లా కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు . స్ట్రాంగ్ రూంలోకి వర్షపు నీరు వచ్చిందని సెక్యూరిటీ సిబ్బంది అధికారులకు సమాచారమిచ్చారు . ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి .. స్ట్రాంగ్ రూంను పరిశీలించేందుకు అనుమతి తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు . బ్యాలెట్ బాక్సులను అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు . నిడమానూరు సెగ్మెంట్​కు చెందిన ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఒక బాక్స్ పై నీళ్లు పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు . బ్యాలెట్ బాక్స్​ను పరిశీలించి నీటితో తడవకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ అన్నారు . స్ట్రాంగ్ రూంను మరోచోటికి మార్చాలా ? లేదా అనే అంశంపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు . బాక్స్ లోని ఓట్లు తడిచాయా ,లేదా అనే విషయం కౌంటింగ్ సమయంలో తెలుస్తుందన్నారు . కౌంటింగ్ సమయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు .

ఇదీ చదవండి: VMC COUNCIL: 'కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్షాల గొంతు నొక్కారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.