కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఛైర్మన్ ఎన్నిక నేడు కావడంతో గెలుపుపై ఇరుపార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తెదేపా నేత దేవినేని ఉమ ఇంట్లో ఆపార్టీ సభ్యులు క్యాంపు ఏర్పాటు చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 29 వార్డులు ఉండగా..., ప్రస్తుతం తెదేపా శిబిరంలో 15, వైకాపా శిబిరంలో 14మంది కౌన్సిలర్ల బలం ఉంది. తెదేపా ఎంపీ కేశినేని నాని, వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తమ ఎక్స్ అఫిషియో ఓట్లు వినియోగించుకోనున్నారు.
ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి తెదేపాకు 16, వైకాపాకు 15 సీట్లకు బలం చేరింది. ప్రత్యర్థుల్ని లొంగదీసుకునేందుకు ప్రలోభాలు, బెదిరింపుల పర్వం ప్రారంభమైంది. కోరం ఉంటేనే ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్యే, పురపాలికలో గెలిచిన కౌన్సిలర్లతో కలిపి మొత్తం 16 మంది కోరమ్‌కు అవసరం ఉండగా... కోరం ఏర్పడ్డాక సభ్యుల నుంచి ఫారం ఏ, బీ లను తీసుకుని చేతులు ఎత్తడం ద్వారా ఎన్నిక నిర్వహణ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి