కొండపల్లి కోట
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ ఖిల్లాను అద్భుత పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిరాదరణకు గురైన కొండపల్లి కోటను అధికారులు సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నీటి, విద్యుత్ సదుపాయాలు లేకున్నా కింది నుంచే మళ్లించి పనులు చేస్తున్నారు.
ఖిల్లాకు సంబంధించిన లేజర్‌షో ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులు అరగంట పాటు వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. పర్యటకులు ఆశ్చర్యపోయేలా... దర్బార్ హాల్‌లో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. సెంట్రల్ ఏసీ సదుపాయంతోపాటు వైఫై సౌకర్యాన్ని అందిస్తున్నారు.
గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫొటోల్లో ఆగ్‌మెంట్ రియాలిటీ సాంకేతిక ఉంది. పర్యటకులు తమ స్మార్ట్ ఫోన్‌లో కొండపల్లి ఖిల్లాకు సంబంధించిన యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్ ద్వారా ఫొటోను స్కాన్ చేస్తే చాలు రాజులే...తమ చరిత్ర వివరిస్తారు. ఈ ఖిల్లా ఆధునికీకరణ పనులు సెంటిల్లా క్రియేషన్స్ సాంకేతిక సాయం అందిస్తోంది. ఇక్కడ శిల్పాలను ముట్టుకుంటే ప్రతిధ్వనిస్తాయి. వాటి చరిత్ర అవే చెప్పుకుంటాయి.
పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న కొండపల్లి కోటకు ప్రాణం పోశారు అధికారులు. సిమెంటు, ఇసుక వాడకుండా...రాజుల కాలంలో ఎలా నిర్మించారో...అలాంటి శాస్ర్తీయ విధానంతో కోట పునరుద్ధరించారు.