కృష్ణా జిల్లా కోడూరు మండల తహసీల్దార్ షేక్ లతిఫ్ పాషా ప్రతిరోజు గంట పాటు ప్రజల కోసం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. రోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రజా దర్బార్లో ప్రజలు తాము పెట్టుకున్న అర్జీ ఏ దశ వరకు వచ్చిందో తెలుసుకోవచ్చు. తమ భూములకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న రికార్డులను ప్రజలు పరిశీలించుకోవచ్చు. అలాగే వారికి అవసరమైన పేపర్లు జిరాక్స్ రూపంలో పొందవచ్చు. నవంబరు 2019 నుండి ఇప్పటి వరకు కోడూరు మండలంలో 2000 మంది అర్జీదారులకు, పట్టాదారులకు పాస్ బుక్కులు, పదివేల వరకు వివిధ రకాల సర్టిఫికెట్స్ మంజూరు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. కోడూరు మండల ప్రజలు కూడా ఈ ప్రజాదర్బార్ వలన సమస్యలు త్వరగా పరిష్కారం అవుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి :