మాజీ మంత్రి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె కోడెల విజయలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. గుంటూరు జిల్లా నర్సరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో తనపై నమోదైన నాలుగు కేసుల్లో 41ఏ సీఆర్ పీసీ కింద నోటీసులు జారీ చేసే విధంగా పోలీసులను ఆదేశించాలని కోడెల విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ..సంబంధిత నాలుగు కేసుల్లో 41 ఏ సీఆర్ పిసీ కింద పిటిషనర్‌కు నోటీసులు జారీ చేసి విచారించాలని పోలీసులను ఆదేశించింది.
ఇదీ చదవండి: వైభవంగా పైడితల్లమ్మ 'సిరిమాను' సంబరం