ETV Bharat / state

గ్రామ సచివాలయాలుగా పంచాయతీలు - kodali nani

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను గ్రామ సచివాలయాలుగా మారుస్తామని రాష్ట్ర పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. నూతన సంస్కరణలను శరవేగంగా చేపడతామని చెప్పారు.

మంత్రి కొడాలి నాని
author img

By

Published : Jun 21, 2019, 4:22 PM IST

రాష్ట్రంలోని అవసరమైన అన్ని గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పెంజేండ్ర గ్రామంలో 15 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామా పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత రైతులకు రాయితీపై వరివిత్తనాలు పంపిణీ చేశారు.

పంచాయతీలను గ్రామ సచివాలయాలుగా మార్పుచేసి ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా చేస్తామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్, నిత్యావసర సరుకులు, గృహ నిర్మాణాలతోపాటు అన్ని పథకాలకు సంబంధించిన పనులను గ్రామ సచివాలయ వలంటీర్లు పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు. ఆగస్టు 15 నుంచి వలంటీర్లను నియమిస్తామన్నారు. ప్రజలు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసిన 72 గంటల్లో వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన అభివృద్ది కుంటుపడిందన్నారు.

ఇదీ చదవండి... 'బద్వేల్ తాగునీటి పథకం అభివృద్ధి చేయండి'

Intro:ఆసుపత్రి అభివృద్ధి సమావేశం

Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఆర్ డి ఓ సువర్ణమ్మ అధ్యక్షతన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సమావేశం జరిగింది ఈ సమావేశంలో లో ఆసుపత్రి లో పలు అంశాలపై చర్చించారు కావాల్సిన వస్తువుల గురించి కొనుగోలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు ఈ జిల్లా నుండే కాకుండా పక్క జిల్లా అయిన కడప జిల్లా నుండి కూడా నిరుపేదలు ఆస్పత్రికి వస్తున్నారని వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు అలాగే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఇంకా మంచి పేరు తీసుకురావాలని ఆర్ డి ఓ గారు సూచించారు ఇప్పటికే ఆసుపత్రి అన్ని విషయాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు

Conclusion:బైట్ సువర్ణమ్మ ఆర్ డి ఓ, కరీం, నెల్లూరు జిల్లా, ఆత్మకూరు, కిట్ నెంబర్ 698

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.