కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన మెుదటి దశ ఇంజినీరింగ్ ప్రవేశ్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విజయవాడలో విడుదలయ్యాయి. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు విశ్వ విద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఎల్ఎస్ రెడ్డి వివరించారు. సుమారు 20 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. మెుదటి దశ పరీక్షలో సరిగ్గా రాయని విద్యార్థుల కోసం రెండో దశ పరీక్షలో అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మెుదటి 25 ర్యాంకులు సాధించిన వారికి దాదాపు 25 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రకటించారు. ఉత్తమ ర్యాంకులు సాధించన వారికి ఉపకార వేతనాలు అందిస్తామని అన్నారు.
ఇదీ చదవండి: