ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలు చేసి ఆంధ్రుల జీవితాలను ప్రశ్నార్ధకం చేస్తోందని ఆధ్యాత్మికవేత్త కమలానంద భారతి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో అమరావతి ఐకాస ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. భూములు ఇచ్చిన రైతులు రోడ్డున పడ్డారన్నారు. రాజధానిని మారిస్తే రాష్ట్రానికి అరిష్టమని స్పష్టం చేశారు. 85 రోజులుగా మహిళలు రోడ్డుపైకి వచ్చి ఉద్యమిస్తుంటే... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు.
ఇదీ చదవండి: