Joint Irrigation and Agriculture Advisory Council Meeting: ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండవ పంట రబీ సాగు చేసుకోవటానికి రైతులకు అనుమతి లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు (Collector Dilli Rao) ప్రకటించారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ఉమ్మడి నీటిపారుదల, వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని విజయవాడ నీటిపారుదల సర్కిల్ ఆవరణలోని రైతు శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్ మోహన్ రావు పాల్గొన్నారు.
కరవు, జగన్ కవల పిల్లలు - చిన్న కరవే అని సీఎం చెప్పడం మూర్ఖత్వం : లోకేశ్
2023- 24 గాను ఇప్పటి వరకు 101.32 టీఎంసీల నీరు ఖరీఫ్, త్రాగు నీటి అవసరాల కోసం ఇప్పటి వరకు వినియోగించామని కలెక్టర్ డిల్లీ రావు తెలిపారు. కృష్ణా డెల్టాకి 61.38 టీఎంసీల నీరు, కృష్ణా పశ్చిమ డెల్టాకు 40 టీఎంసీల నీరు ఉపయోగించామన్నారు. రబీ పంటకు కృష్ణా బోర్డు ఆమోదించిన కృష్ణా డెల్టాకి 152 టీఎంసీల కేటాయించమన్నారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వలన కృష్ణా పరివాహక ప్రాంతము నుంచి నీటి లభ్యత లేనందువలన అమోదించిన మేర నీరు లభించలేదని తెలిపారు.
కరవు తాండవిస్తున్నా కల్లబొల్లి మాటలతో కప్పిపుచ్చే యత్నం - రైతుల కన్నీరు కనిపించడం లేదా?
త్రాగునీటి కోసం 2 టీఎంసీల నీరు.. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి 44.50 టీఎంసీలు, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (Pattiseema Lift Irrigation Project) నుంచి 36.09 టీఎంసీలు, కృష్ణా నది ప్రవాహం నుంచి 20.73 టీఎంసీల నీటిని ఇప్పటి వరకు వినియోగించామని అన్నారు. రెండవ సారి పంట వేయాలన్నా కందులు,పెసలు, మినుములు లాంటి పంటలు (Irrigation water problem in AP) సాగు చేసుకోవాలని సూచించారు. రెండు రోజుల్లో త్రాగునీటి కోసం 2 టీఎంసీల నీటిని కాలువలకు, చెరువులకు విడుదల చేస్తున్నామని, వాటిని త్రాగునీటికి మాత్రమే వాడుకోవాలని రైతులు పోలాలకు మళ్లించుకోవటం నిషేదించమని కలెక్టర్ డిల్లీ రావు తెలిపారు.
ఒక్క మండలాన్నీ కరవు జాబితాలో చేర్చని వైసీపీ ప్రభుత్వం - సర్కారు తీరుపై మండిపడుతున్న రైతు సంఘాలు
ఎన్నడూ లేని విధంగా కరవు.. ఈ ఏడాది కృష్ణా పరీవాహకంలో ఎన్నడూ లేని విధంగా కరవు వచ్చింది. ఫలితంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండలేదు. సాగర్ కుడి కాలువ కింద ఆయకట్టు సాగుకు.. నీళ్లు ఇవ్వలేమని సర్కారు తేల్చి చెప్పేసింది. దీంతో సాగర్ కుడి కాలువ కింద గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని 11 లక్షల 16 వేల 622 ఎకరాల ఆయకట్టులో రైతులు చాలావరకు సాగు వదిలేయాల్సి వచ్చింది. సాగర్ కుడి కాలువకు 132 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నా ఆ నీళ్లను ఇవ్వలేదు. అక్కడక్కడ అరుతడి పంటలు సాగు చేసినా వాటికి నీటి ఇబ్బందులు తప్పడం లేదు. బోర్డు, వాగుల నీటిని ఎత్తిపోసి సాగు చేసినా సమస్యలు తప్పలేదు.