రహదారి మరమ్మతులు చేపట్టాలంటూ కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రహదారిపై నిలిచిన మురుగునీటిలో నిలబడి రహదారులకు మరమ్మతు చేయించాలని నినాదాలు చేశారు. రద్దీగా ఉండే పాతకంకిపాడు రోడ్డుపై గుంతలు పడి మురుగునీరు ప్రవహిస్తోంది. వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్పందన కార్యక్రమంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: