జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిని సామాజిక మాధ్యమం ద్వారా అందరికీ తెలియజేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ తెలిపారు. ‘‘#jspforap_roads హ్యాష్‌ట్యాగ్‌తో చేపట్టిన ఈ ఉద్యమానికి రెండు రోజుల్లోనే 1.73లక్షల ట్వీట్లు వచ్చాయి. వేలాది మంది తమ ప్రాంతాల్లో రోడ్లు ఏవిధంగా ఉన్నాయో తెలియజేస్తున్నారు. ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.
-
ఆంధ్ర ప్రదేశ్ రోడ్ల దుస్థితి పై @JanaSenaParty డిజిటల్ క్యాంపన్
— JanaSena Party (@JanaSenaParty) September 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గం,
రాజాం - విశాఖ ప్రధాన రహదారి మార్గం.#JSPForAP_Roads pic.twitter.com/gomelm3VlT
">ఆంధ్ర ప్రదేశ్ రోడ్ల దుస్థితి పై @JanaSenaParty డిజిటల్ క్యాంపన్
— JanaSena Party (@JanaSenaParty) September 3, 2021
శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గం,
రాజాం - విశాఖ ప్రధాన రహదారి మార్గం.#JSPForAP_Roads pic.twitter.com/gomelm3VlTఆంధ్ర ప్రదేశ్ రోడ్ల దుస్థితి పై @JanaSenaParty డిజిటల్ క్యాంపన్
— JanaSena Party (@JanaSenaParty) September 3, 2021
శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గం,
రాజాం - విశాఖ ప్రధాన రహదారి మార్గం.#JSPForAP_Roads pic.twitter.com/gomelm3VlT
'గురువారం నుంచి మొదలైన ఈ కార్యక్రమం శనివారం వరకు కొనసాగుతుంది. రోడ్ల దుస్థితి 192.9మిలియన్ల మందికి చేరింది. ట్విటర్ ట్రెండింగ్‌లో రాష్ట్ర స్థాయిలో మొదటి, జాతీయస్థాయిలో ఐదో స్థానానికి చేరింది. అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా రాష్ట్రంలో రహదారులు ఉన్నాయని పవన్ కల్యాణ్ చెప్పిన విషయం అక్షర సత్యమనే విషయం ఈ డిజిటల్ ఉద్యమంలో వస్తున్న ఫొటోలు, వీడియోలను చూస్తే అర్థమవుతోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఫొటోలు, వీడియోలు పంపించేందుకు సాధ్యంకాని వారి కోసం ఇచ్చిన వాట్సప్ నంబరుకు 10,455 చిత్రాలు, రెండు నిమిషాల నిడివి ఉన్న 5వేలకుపైగా వీడియోలు వచ్చాయి’’ - హరిప్రసాద్
ఇదీ చూడండి: HIGH COURT: తల్లుల ఖాతాల్లో బోధన రుసుములా!