అర్చకునికి, పురోహితునికి తేడా తెలియని వ్యక్తి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉండడం దురదృష్టకరమని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ మండిపడ్డారు. విజయవాడ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. 2019 నుంచి ఇప్పటివరకు బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి బ్రాహ్మణ, అర్చకుల కుటుంబాలకు 5000 రూపాయలు ఆర్ధిక సాయం చేయాలని కోరారు. సీఎం బయటకు రాకుండానే సమీక్షలు చేస్తున్నారని విమర్శించిన ఆయన పవన్ కళ్యాణ్ మీద అర్హత లేని వారు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు.
ఇవీ చూడండి..