ETV Bharat / state

మున్నెటి వంతెన వద్ద జనసేన నాయకుల ధర్నా - లింగాల మున్నెటి వంతెన వార్తలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం లింగాల గ్రామంలో మున్నెటి వంతెన వద్ద జనసేన నాయకులు ధర్నా చేశారు. మున్నెటి వంతెనపై పారుతున్న భారీ వరదకు మంచినీళ్ల పైపులు దెబ్బతిన్నాయని.... ప్రజలు తాగడానికి నీరు లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తాగునీటి సౌకర్యం కల్పించి.. వంతెనను ఎత్తుగా నిర్మించాలని డిమాండ్ చేశారు.

janasena leaders protest at munneti bridge
మున్నెటి వంతెన వద్ద జనసేన నాయకులు ధర్నా
author img

By

Published : Sep 18, 2020, 6:01 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం లింగాల గ్రామం మున్నేటి వంతెన వద్ద జనసేన నాయకులు నిరసన చేపట్టారు. ఎగువ ప్రాంతాన కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకు...లింగాల మున్నేటి వంతెన దిగువగా ఉండటం వలన వంతెన మీదకు నీరు చేరుతోంది. వరద వల్ల పైపులు దెబ్బతినడంతో... మండలంలోని వత్సవాయి, లింగాల, చిట్యాల, సింగారం, మక్కపేట, బీమవరం, గంగవల్లి పోచారం, వేములనర్వ పలు గ్రామాల ప్రజలకు మంచినీటి కొరత ఏర్పడింది. దాదాపు నెల రోజులనుంచి ప్రజలు మంచినీరు అందక ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ అన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి ... పైపులైన్లు మరమ్మతులు చేేయించాలని కోరారు. మున్నేటి వంతెనను కూడా ఎత్తుగా నిర్మించాలని మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో లింగాల ఎంపీటీసీ అభ్యర్థి రేగండ్ల వెంకటరామయ్య, నండ్రు రాము, అంబాజి గోపి, భూషణం, ఉపేంద్ర, రాంబాబు, చెన్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి. హెరిటేజ్ ఫుడ్స్ నుంచి మార్కెట్​లోకి కొత్త ఉత్పత్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.