కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు ఇచ్చిన తీర్పు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. దేశ చరిత్రలో ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఇదే తొలిసారన్న ఆయన.. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు జేజేలు పలికారని తెలిపారు. అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని సమానంగా విస్తరించాలనే ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని పేర్కొన్నారు.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన విస్పష్టమైన తీర్పు దీన్ని తేటతెల్లం చేసిందన్నారు. విద్యావంతులు అధికంగా ఉండే మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మూడు రాజధానుల నిర్ణయాన్ని అంగీకరించటం లేదనే ప్రచారం అంతా భ్రమేనని స్పష్టమైందన్నారు. అనంతరం వారి నివాసం వద్ద నాయకులు స్వీట్లు పంచిపెట్టి, బాణసంచా కాల్చి సందడి చేశారు.
ఇవీ చూడండి...