విద్యుత్తును నిబంధనల మేర వినియోగించని వినియోగదారుల నుంచి రూ.2.27 కోట్లు వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యుత్తు చౌర్య నిరోధక విభాగం అధికారులు గత నెలలో తనిఖీలు నిర్వహించి అక్రమంగా విద్యుత్తును వినియోగిస్తున్నవారిని గుర్తించారు. ప్రధానంగా గృహ అవసరాలకు అనుమతి తీసుకుని, వాణిజ్య అవసరాలకు విద్యుత్తును వినియోగించుకుంటున్న 98 మందిని గుర్తించి రూ.48.07 లక్షలు వసూలు చేయాలని నోటీసులు జారీ చేశారు. అనుమతించిన లోడ్ కంటే అదనంగా వాడుకుంటున్న 381 మందిని గుర్తించి రూ.32.80 లక్షలు వసూలు చేయాలని నిర్ణయించారు.
తక్కువగా బిల్లులు ఇచ్చిన 134 సర్వీసులను గుర్తించి రూ. 104.32 లక్షలు చెల్లించాలని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. మీటర్ లేకుండా విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న 87 మందిని గుర్తించి రూ.2.97 లక్షలు, మీటర్ ఉన్నా అక్రమంగా విద్యుత్తును వినియోగించుకుంటున్న 50 మందికి రూ.39.37 లక్షలు అపరాధరుసుం విధించారు. విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నట్లు తెలిస్తే 94408 12263, 83310 21847 నంబర్లకు ఫోన్ చేయవచ్చని ఈఈలు విజయకృష్ణ, కేవీఎల్‌ఎన్ మూర్తి తెలిపారు.
ఇవీ చూడండి: