స్త్రీలపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ నేటి నుంచి డిసెంబర్ 10వరకు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రచారోద్యమాన్ని చేపట్టామని దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో సంబంధిత గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు.
దళిత స్త్రీ శక్తి, దళిత స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసపై పోరాడతామని స్పష్టం చేశారు. పురుషాధిక్య భావజాలమున్న సమాజంలో స్త్రీలను చైతన్య పరిచి లింగ సమానత్వం కోసం పాటుపడతామని వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామస్థాయి నుంచి 16 రోజుల ప్రచారోద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: