రాజ్‌భవన్ ముట్టడిలో భాగంగా వెళ్తున్న ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్‌ను పోలీసులు అడ్డుకోవడానికి చేసిన యత్నంలో ఆయనకు గాయాలయ్యాయి. కిసాన్ అధికార దివాస్ సందర్భంగా "చలో రాజ్‌భవన్" కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. విజయవాడలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజ్‌భవన్ ముట్టడికి వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ జరిగిన తోపులాటలో శైలజానాథ్ స్వల్పంగా గాయపడ్డారు.
ఇదీ చదవండి: దేవినేని ఉమకు రాత్రి నుంచి పదిసార్లు ఫోన్ చేశా: కొడాలి నాని