కువైట్లో ఉపాధి, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాసీయులు ప్రభుత్వ సహయంతో రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్రానికి తీసుకొచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు. బాధితుల విషయాన్ని వైకాపా యువత అధ్యక్షుడు కె.మోక్షిత్ ద్వారా తెలుసుకున్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు సీఎంతో మాట్లాడి వారి రాకకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సత్యమ్స్ స్వేచ్ఛ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు సత్యం ఆర్థిక సహకారం చేశారు. ప్రవాసాంధ్రుల ప్రత్యేక విమానం శుక్రవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొంది. వస్తారో.. రారో అనుకున్నవారందరూ స్వస్థలాలకు చేరడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన ఏర్పాట్లను అడ్వకేట్ రవి, మోక్షిత్ బృందం పర్యవేక్షించారు.
ఇదీ చూడండి. రాష్ట్రానికి 16 పోలీసు మెడల్స్..డీజీపీ అభినందనలు