విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్... డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాసింది. ఈ విషయంలో వైద్యులను దోషులుగా చూడొద్దని లేఖలో పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లను నడిపేందుకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని ఐఎంఏ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు కేర్ సెంటర్లు, ప్రభుత్వానికి ఉపయోగపడతాయన్న ఉద్దేశ్యంతోనే అనుమతులిచ్చినట్లు లేఖలో పేర్కొంది.
స్వర్ణ ప్యాలెస్ చాలా కాలం వరకు స్టార్ హోటల్‌గా ఉంది. అక్కడ అన్ని అనుమతులూ ఉండే ఉంటాయని భావించి... అక్కడి పరిస్థితులు పరిశీలించకుండానే వైద్యారోగ్య శాఖ అనుమతులిచ్చి ఉంటుందని భావించడం లేదని లేఖలో పేర్కొంది.
కరోనా కాలంలో ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా వైద్యులు పోరాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రమేష్ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బందిని ఈ చర్యకు బాధ్యులుగా చేయడం తగదని లేఖలో తెలిపింది. ముఖ్యంగా వైద్యుల విషయంలో సంయమనం పాటించాలని... ఈ విషయంలో వైద్యులపై తదుపరి చర్యలు తీసుకోకుండా సంయమనం వహించాలని ఐఎంఏ ఏపీ శాఖ అధ్యక్షుడు ఎస్వీకే ప్రసాదరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫణిందర్లు తెలిపారు.
ఇదీ చదవండి: