ETV Bharat / state

రూ.1.32 లక్షల విలువైన మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్టు - krishna latest news

కృష్ణా జిల్లా దొండపాడులో చేసిన దాడుల్లో ఎస్​ఈబీ అధికారులు 926 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తి అరెస్ట్ చేశారు. అక్రమ మద్యం రవాణా, నిల్వలపై ఉక్కు పాదం మోపుతామని స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.

illigal liquor cought
దొండపాడులో అక్రమ మద్యం పట్టివత
author img

By

Published : Apr 15, 2021, 4:11 PM IST

అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతామని స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. గుడివాడ స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బుధవారం రాత్రి గుడివాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో సంయుక్తంగా దాడులు నిర్వహించినట్టు చెప్పారు.

గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో 926 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు లక్షా 32 వేలు ఉంటుందని తెలిపారు. నిందితుడు వల్లూరుపల్లి సురేష్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపామన్నారు.

ఇదీ చదవండి:

'తప్పుడు కేసులు, నోటీసులకు భయపడేది లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.