కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమంగా తరలిస్తున్న 225 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. బైపాస్ రోడ్డు మీదుగా తరలిస్తున్న బియ్యాన్ని సిబ్బందితో కలిసి విజిలెన్స్ ఎస్సై శివరామకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. కోడూరు నుంచి కాకినాడ వైపు లారీలో సరుకు తీసుకెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
ఇదీ చదవండి: కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి...