ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా కృష్ణాజిల్లా కీసర టోల్‌గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పలు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ. 4.15 లక్షల నగదు, సుమారు 80 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న నగదు, బంగారాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు.
ఇదీ చదవండి: ఉత్కంఠ నడుమ పాలపాడు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్