ETV Bharat / state

హైదరాబాద్​ ఐబీఎస్‌లో ర్యాగింగ్ కలకలం.. 12 మంది విద్యార్థులు సస్పెండ్ - ర్యాగింగ్ పై స్పందించిన కేటీఆర్​

Raging in Indian Business School: హైదరాబాద్​లోని ఇండియాన్​ బిజినెస్​ స్కూల్​లో ర్యాగింగ్​ ఘటనకు సంబంధించి 12 మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్​ చేసినట్లు ఐబీఎస్​ యాజమాన్యం తెలిపింది. గదిలో జూనియర్​ విద్యార్థిని కొందరు సీనియార్లు బంధించి దాడి చేసిన వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి రాగా దీనిపై స్పంధించిన కేటీఆర్..​ ఘటనపై విచారణ జరపమని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీరిని సస్పెండ్​ చేశారు.

హైదరాబాద్​ ఐబీఎస్‌లో ర్యాగింగ్ కలకలం
హైదరాబాద్​ ఐబీఎస్‌లో ర్యాగింగ్ కలకలం
author img

By

Published : Nov 12, 2022, 12:16 PM IST

Raging in Indian Business School: హైదరాబాద్​లోని శంకర్​పల్లిలో ఇండియాన్​ బిజినెస్​ స్కూల్​లో జూనియార్​ విద్యార్థిపై కొందరు సీనియార్​ విద్యార్థులు దాడి చేసిన ఘటనలో 12మంది విద్యార్థులను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తున్నట్లు కాలేజీ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 1న ఐబీఎస్​లో జూనియార్​ విద్యార్థిపై కొందరు సీనియార్లు గదిలో బంధించి దాడి చేశారు. దీనికి సంబంధించి వీడియోలు వారం రోజులు తరువాత సోషల్​ మీడియాలో వైరల్​కాగా స్పందించిన పోలీసులు విద్యార్థులకు సర్దిచెప్పి వారిని పంపించారు. దీనితో చేసింది ఏమీ లేకా బాధిత యువకుడు మంత్రి కేటీఆర్​కు ​ ట్వీట్​ చేస్తూ న్యాయం చేయమని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్​ ఘటనపై దర్యాప్తుకు ఆదేశాలు చేశారు. దీనితో ఈరోజు 12మంది విద్యార్థులను యాజమాన్యం సస్పెండ్​ చేసింది. దర్యాప్తు అనంతరం మరికొందరిపై వేటు తప్పదని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.