ప్రశ్న: చైనా పోకడలు సరిహద్దులో ఏ విధమైనా ప్రభావాన్ని చూపిస్తున్నాయి..?
త్రివిక్రమ్: చైనా చరిత్ర గురించి మాట్లాడితే..సరిహద్దు దేశాలతో తనే సమస్యలు సృష్టించుకుంది. విస్తరణ కాంక్షతో ప్రపంచంలో పెత్తనం సాగించాలనే దురాశ భాగం ఉంది. 1962లో మనదేశ పాలకులు చైనాతో సంబంధాల విషయంలో మెతక వైఖరి అవలభించడంతో అది ముందుకు మన మీదకి చొచ్చుకవచ్చింది. సరిహద్దు ప్రాంతాలలో అపారమైన భూగర్భ సంపద ఉంది. తర్వాత వాళ్లే కనుక్కున్నారు. అక్కడ హిమాలాయాలు, లోయలు,నదులు ఉండంటంకతో గస్తీ తిరగడం కష్టం.1962లో మన సైనికులకు సరైన సౌకర్యాలు లేవు. కొన్ని విపత్కర పరిస్థితులో మనం లక్షల చదరపు మైళ్లున్న విశాల భూభాగాన్ని పోగొట్టుకున్నాం. దానికి తిరిగి పొందడం కష్టంగా ఉంది. 1962-75 సంవత్సరంలో మన సైనికులను చైనా దళాలు హతమార్చాయి. తాగాజా గస్తీ చేస్తున్న మనవాళ్లను చైనా దళాలు నెట్టేసే భూభాగాన్ని అక్రమించుకోవాడానికి కాలుదువ్వింది.
గస్తీ బృందాల మీద దాడులు చేస్తూ..మెల్లమెల్లగా మన స్థావరాలను అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడూ వీటిని పట్టించుకోలేదు.. నిర్ణాయత్మకమైన ఈ ప్రభుత్వం దీనిని పట్టించుకుంటూ..మెతక వైఖరి లేకుండా నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ..సరిహద్దు ప్రాంతాలలో గస్తీ కాయడానికి రవాణాను సులభతరం చేస్తోంది. రహదారులు వేసి భద్రతను పటిష్టం చేస్తుంటే..చైనాకు ఇది నచ్చడంలేదు. వీటిని అడ్డుకోవాడానికి ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తోంది.
నేపాల్ ఎందుకు మనల్ని రెచ్చగొడుతుందంటే..ఇది కూడా చైనా వ్యూహంలోని భాగమే! చైనా క్రూరత్వం చెప్పాలంటే..ప్రపంచదేశాలలో చైనా ఆర్థికంగా నిలదొక్కుకొని ఉంది. కాబట్టి పేద దేశాలకు ఆర్థికంగా సాయం చేస్తుంది. వాళ్లు వాటిని తిరిగి చెల్లించకుండా...ఇలాంటి పన్నాగాలలో ఆ పేద దేశాలను ఇరికించి వాళ్ల పనులు చేయించుకుంటోంది.
తాజాగా..నేపాల్‌లోని ఉపాధ్యాయులకు చైనా జీతాలు ఇస్తూ...వాళ్లు అక్కడే ఏం చెప్తారో తమ దేశంలో కూడా చెప్పేలాగా ఒప్పందం చేసుకున్నారు. భారత్- నేపాల్‌కు శతాబ్దాలనుంచి చరిత్రాత్మకంగా మంచి సంబంధాలును ..చెడగోట్టేలా చేసింది. రాజులను చంపేసి..వాళ్ల స్థానంలో ప్రత్యామ్నయంగా కీలుబొమ్మలాంటి వ్యక్తులను పెట్టి..నేపాల్‌ను తన కనుసన్నల్లో ఉంచుకుంది. ఇప్పుడు మన భూభాగాలు కూడా నేపాల్‌వే అని మొన్ననే బిల్లు తెచ్చారు. ఇదంతా చైనా ఆడిస్తోంది. మనల్ని ఒత్తిడులకు గురిచేసి...లోబర్చుకోవాలని చైనా ఉద్ద్యేశం.
మన చూట్టూ ఉన్న దేశాలతో స్నేహాన్ని పెంచుకుని..అక్కడి తీరప్రాంతాలలో స్థావరాలు ఏర్పరుస్తూ రెచ్చగొడుతుంది. మన శత్రువులను మిత్రులుగా చేసుకుని మనపైకి ఉసిగొల్పుతుంది. ఇప్పటికే పాకిస్థాన్‌ను తన ఆధీనంలో ఉంచుకుంది. మన భారత్ ధీటైనా సమాధానాలు ఇవ్వడంతో దానికి మింగుడుపడటంలేదు. దక్షిణా చైనా సముద్రంలో ఆధిపత్యం కోసం కాల్పనిక ద్వీపం తయారుచేసి స్థావరాలను ఏర్పరచుకుంది. 100నౌకలు, 70కిపైగ జలంతార్గాములు ఉన్నాయి ఇప్పటికే 2 కిమీ ల ముందుకు వచ్చారని సమాచారం.
మన స్థావరాలను పటిష్టం చేసుకోవాలి. యుద్ధమైతేరాదు..ఒకవేళా వచ్చినా ప్రపంచదేశాల మద్దతు మనకుంది. పర్వాతారోహాల పనికొచ్చే ఆయుధాలు వాడుకోవాలి. రష్యా తటస్థంగా ఉంటుంది. అమెరికా మనకు క్షిపణులు, ఆయుధాలు, జలంతార్గాములు నాశనం చేసే రూబీ హెలికాప్టర్స్ , అత్యాధునిక ఆయుధాలను అందిస్తోంది. ఐరన్‌డోమ్ శత్రుదేశాలనుంచి క్షిపణులు వస్తే...నాశనం చేసే యాంటీ మిస్సైల్ ఒప్పందం 1.5 బిలియన్ డాలర్లతో జరిగింది.
ఇవి ఆలస్యంగా జరిగాయి. పాత విమానాలు తీసేశారు. పాత ప్రభుత్వాలు ఆలసత్వంతో కొత్త విమానాలు అందించలేదు. ఆ లోటు ఇప్పటికి ఉంది. కీలక సమయాల్లో విమానాల ప్రత్యేక భాగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. 1965-77 యుద్ధంలో యూకేకు చెందిన కాన్బేరా బామర్స్లో నేను పాల్గొన్నాను. అప్పట్లో ఫ్రాన్స్ యుద్ధవిమానాలు గొప్పవి. అప్పుడు వాడినవే..మనం ఉపయోగించే రాఫెల్ యుద్ధవిమానాలు..( మన దేశం నుంచే దాడి చేసే గొప్ప సాంకేతికను కలిగిఉంది). ఇవి ఖరీదెక్కువ.
ప్రశ్న: జీ -7 దేశాలు భాగస్వామ్యంగా భారత్‌ను ప్రతిపాదించినందుకే..రష్యాకు వాణిజ్యపరంగా నష్టాలు ఏర్పడుతాయని భావించి ఇలా
చేస్తోందా..?
త్రివిక్రమ్: జీ-7 దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు.మనది ఆ కోవకు చెందదు. మారుతున్న పరిస్థితులలో చైనా ఆర్థికంగా, బలంగా , సైనిక శక్తితో అభివృద్ధి చెందుతూ.. ప్రమాదకరంగా మారిందో అందుకని అమెరికా చొరవతో..జీ- 7 దేశాలకు మనల్ని ప్రతిపాదించింది. జీ- 7 దేశాల సంఖ్య పెరగవచ్చు. దీనివల్ల వ్యాపారం విస్తృతంగా పెరుగుతుంది. చైనా ఆర్థిక శక్తికి మనం ధీటుగా నిలబడుతాం.
అమెరికాలో ఉన్న ఆయుధాలన్నీ చైనా ఉన్నాయి. బాంబర్, స్టెల్ట్( రాడార్‌కు కూడా దొరకదు) ఉన్నాయి. సాంకేతి లోటుబా ట్లను పూడ్చకోవాలి. ఎఫ్-27 తయారు చేయాలి. జీ- 7 దేశాలలో మన భాగాస్వామ్యం ఉంటే మనమో ఓ గొప్ప ఆర్థికశక్తిగా తయారుకావొచ్చు.
ప్రశ్న: అణ్వాయుధాలున్న రెండు దేశాల మధ్య ఇలాంటి వాతావరణాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్చలు జరపాలి? నిర్ణయాలు తీసుకోవాలి?
త్రివిక్రమ్: అణ్వాయుధాల ప్రయోగం ఎవరూ చేయరు. భయపెట్టడానికి మాత్రమే అది పనికొస్తుంది. ఇక్కడ చర్చలే ముఖ్యం.చర్చలకు వెళితే..మనకు ముఖ్యమైన వాటిని వదులుకోమంటారు. సున్నితంగా మన ముందు సమస్యలు పెడుతారు. అమెరికాతో స్నేహం చేయొద్దు అనడం( వాళ్ల ఆయుధాలు భారత్‌కి ఇస్తారు కనుక), మన ప్రాంతాలను వదులుకోమని బెదిరించడం లాంటివి చేస్తారు. చైనాకు లాభమయ్యే పనులు మాత్రమే చేయాలని ప్రతిపాదనలు ఉంచుతారు. చర్చల పేరుతో ఉద్రిక్తతను తగ్గించొచ్చు.
ప్రశ్న: చైనా అధ్యక్షుడు భారత్‌కి వచ్చి మంచి వాతావరణం నెలకొల్పి ..ఇప్పుడు ఘర్షణ మొదలయ్యే పరిస్థితికి ఎలా తీసుకొచ్చారు?
త్రివిక్రమ్: చైనా కేవలం డ్రామా చేసింది. 1962 యుద్ధం ముందు వచ్చారు. అప్పుడు యుద్ధం జరిగింది. పాముతో ఎంత ప్రేమగా ఉన్నా కాటేస్తుంది. మన భూభాగాలను మనం కాపాడుకోవడం మన బాధ్యత. ..అది వారు కాలరాసీ మన భూమిని స్వాధీనం చేసుకుంటామని అంటే ఎవరూ ఊరుకుంటారు.
ఇదీ చూడండి. చైనా-భారత్ వివాదం: ఈటీవీ భారత్ కథనాలు