మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.. నిందితురాలిగా ఉన్న కిడ్నాప్ కేసుకు సంబంధించి.. కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన నలుగురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన వంశీ, సాయి అనే ఇద్దరు యువకులతో ఈ కేసుకు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సేకరించారు.
వీరితో పాటు మరికొందరు యువకులకు సంబంధం ఉన్నట్లు వెల్లడించారు. వీరి కోసం అన్వేషించగా అన్నదమ్ములు గోవాలో ఉండగా... మిగిలిన వారు కొండపల్లిలో ఉన్నట్లు గుర్తించారు. వంశీ, సాయిలను గోవాలోనే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నలుగురిని.. కొండపల్లి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి:
పండగ రోజునా పోరాటం.. భోగి మంటల్లో అమరావతి వ్యతిరేక చట్టాల దహనం