రాష్ట్రంలో నాటిన ప్రతి మొక్క వందశాతం బతికేలా చర్యలు చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఐటీడీఎ, సాంఘీక సంక్షేమ, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మొక్కలన్నీ 100% బతికేలా చర్యలు
పచ్చదనం కోసం మొక్కలు నాటుతున్నా...వాటిని బతికించే ఏర్పాట్లను సిబ్బంది చేయడం లేదన్నారు. చెట్ల మనుగడ శాతం పెంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్ఓఎఫ్ భూముల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని కోరారు. పంచాయతీ, నరేగా సిబ్బంది కలిసి..గ్రామస్థాయిలో చెట్లు పెంచే కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
ప్రత్యేక బృందాలతో అధ్యయనం
చత్తీస్‌గడ్ రాష్ట్రంలో అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపనున్నారు. ఈ విధానం ద్వారా సోషియల్ ఫారెస్ట్రీ వాళ్లు చేపట్టే నర్సరీల నందు మొక్కల వివరాలు ఆన్లైన్ విధానం ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా గ్రామ పంచాయతీలు ఇతర ప్రభుత్వ సంస్థలు వారికి కావలసిన మొక్కలు తీసుకొనుటకు ఉపయోగపడుతుందన్నారు.
గిరిజనాభివృద్ధి
సామాజిక విభాగం ద్వారా పెద్ద మొక్కల నిర్వహణకు మూడు సంవత్సరాల వరకు నిర్వహణ అదనపు ఖర్చులను నరేగా భరించనుందన్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా గ్రామ స్థాయి, గిరిజన ప్రాంతంలోని ఏటీఎంలకు సరిపడే నగదు ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. ఆ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలకు ప్రహారీ గోడలు నరేగా నిధుల ద్వారా చేపట్టాలన్నారు.
ఇవీ చదవండి