విరసం వ్యవస్థాకుడు వరవరరావును కాపాడాలంటూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ లేఖ రాశారు. మహారాష్ట్రలోని జైలులో తీవ్ర అనారోగ్యంతో వరవరరావు బాధపడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేయాలని కోరారు. భీమా కోరేగాం-ఎల్గార్ పరిషద్ కేసులో వరవరరావును అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి. సచివాలయం భవనం పైనుంచి పడి యువకుడి అనుమానాస్పద మృతి