కృష్ణా జిల్లా కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్లో భారీ కుంభకోణం బయటపడింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు చేపట్టిన తనిఖీ(pds ride scam at Kaikalur mls point in Krishna district)ల్లో.. రూ. కోటి విలువ చేసే బియ్యం బస్తాలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. గోడౌన్లో స్టాకు ఉన్నట్టు భ్రమ కల్పించేలా.. బియ్యం బస్తాల మధ్య చెక్క పెట్టలతో చుట్టూ ఏర్పాట్లు చేశారు. చెక్క పెట్టల మధ్య ఖాళీ ఉంచిన తీరుపై విజిలెన్స్ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. గోడౌన్లో రూ.కోట్లలో స్టాక్ వ్యత్యాసం ఉన్నా గుర్తించకపోవడంతో పౌరసరఫరాల శాఖ అధికారుల ప్రమేయంపై విజిలెన్స్ బృందాలు(hug pds rice seized) అరా తీస్తున్నాయి.
ఎంఎల్ఎస్లో బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు, పామాయిల్ ప్యాకెట్లులో కూడా భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలు కొనసాగుతున్నందున పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎంఎల్ఎస్ గోడౌన్లో భారీ మొత్తంలో బియ్యం బస్తాలు మాయమైనా(pds ride scam at Kaikaluru mls point) అధికారులు గుర్తించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి..