ETV Bharat / state

బాలికను గర్భవతిని చేసిన హోంగార్డు - minor cheated by homeguard in krishna district

మచిలీపట్నంలో హోంగార్డుగా పని చేస్తున్న ఫణీంద్ర... స్థానికంగా ఉన్న ఓ బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. కుటుంబసభ్యులు ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించగా... గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు.

homeguard cheats minor in machilipatnam
హోంగార్డు ప్రేమ మోసాన్ని వివరిస్తున్న అడిషనల్​ ఎస్పీ సత్తిబాబు
author img

By

Published : Feb 22, 2020, 5:19 PM IST

బాలికను గర్భవతిని చేసిన హోంగార్డు

ప్రేమ పేరుతో పరిచయం పెంచుకున్నాడు ఓ హోంగార్డు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 15 ఏళ్ల బాలికను గర్భవతిని‌ చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఫణీంద్ర అనే యువకుడు హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. స్థానికంగా ఉంటున్న ఓ బాలిక​ అతనికి పరిచయమయ్యింది. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి పేరుతో లోబరుచుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ బాలికను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు గుర్తించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఫణీంద్రను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు ఏఎస్పీ సత్తిబాబు తెలిపారు.

ఇదీ చదవండి :

ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు..మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.