నంద్యాలలో పోలీసుల వేధింపులతో సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించినా...ప్రతిపక్షాలు ఏదో ఒక బురద చల్లాలని చూస్తున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత అభిప్రాయపడ్డారు. జగన్ పాదయాత్ర చేసి మూడేళ్లైన సందర్భంగా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో హోంమంత్రి పాదయాత్ర చేశారు. సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు కారకులైన సీఐ, హెడ్ కానిస్టేబుల్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. అలాంటి వారికి బెయిల్ వచ్చేలా ఎవరు చేశారో అందరికి తెలుసన్నారు. అయినా కూడా కారకులైన వారి బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన తమలాంటి ప్రభుత్వం ఎక్కడా లేదన్నారు.
సలాం కుటుంబం వీడియో చూసిన గంటల వ్యవధిలోనే సీఎం చర్యలకు అదేశించారని...ఎవరూ అడగకపోయినా 25 లక్షలు చెక్కు అందించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం వేగంగా స్పందిస్తున్నా...ప్రతిపక్షాలు బురుదజల్లడమేంటని ఆమె ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు పంపిణీ జరగకుండా తెదేపా మోకాలడ్డుతోందని ఆరోపించారు.
ఇవీ చదవండి