కరెంటు బిల్లులు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామస్థులకు ప్రతి నెలా 120 నుంచి 3 వందల రూపాయల వరకు కరెంటు బిల్లు వచ్చేది. కాగా మే నెలకు 15 వందల నుంచి 2 వేలకు మించి కరెంటు బిల్లులు రావటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యుత్ శాఖ సిబ్బందిని ప్రశ్నించగా, కరెంటు బిల్లు కట్టి తీరాల్సిందేనని చెప్పారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నెల రోజులో వంద నుంచి వేలకి కరెంటు ఏ విధంగా పెరిగిందో, సామాన్యుడికి ఒక యూనిట్ విద్యుత్‌ను ఏ ధరకు ఇస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. తక్షణమే అధిక విద్యుత్ ధర సమస్యపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: నష్టాల్లో పసుపు సాగు... పట్టించుకోరా సారూ?