high court on Kondapalli municipal: కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాల విచారణ ఈనెల 29కి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఈమేరకు ఆదేశాలు జారీచేశారు. అంతకు ముందు కొండపల్లి ఎన్నికకు సంబంధించిన వీడియో, ఇతర వివరాల్ని అధికారులు న్యాయమూర్తికి అందజేసేందుకు యత్నించారు. విచారణను వాయిదా వేస్తున్న నేపథ్యంలో ఆర్వో వద్దనే ఆ వివరాలు ఉంచాలని స్పష్టం చేశారు. ఫలితాల ప్రకటనకు అనుమతిచ్చేలా ఆదేశించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. మరోవైపు ఎక్స్ ఆపిషియో సభ్యునిగా తెదేపా ఎంపీ కేసినేని(MP kesineni nani) దాని ఓటు హక్కు అర్హత విషయంలో దాఖలైన వ్యాజ్యం సైతం సోమవారానికి వాయిదా పడింది.
కోర్టు ఆదేశాలతో..
మూడు రోజులుగా ఉత్కంఠ రేపిన కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఛైర్మన్ ఎన్నిక వివరాలను ఎస్‌ఈసీ హైకోర్టుకు అందజేయనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహించిన అధికారులు.. ఎన్నికకు ముందు వార్డు సభ్యులతో ప్రమాణం చేయించారు. హైకోర్టు అనుమతి మేరకు ఎంపీ కేశినేని నాని ఎక్స్‌అఫిషియో ఓటును వినియోగించుకున్నారు. చెన్నుబోయిన చిట్టిబాబును తెదేపా.. ఛైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదించింది.
కొండపల్లి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరిగింది. ఛైర్మన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబును ప్రతిపాదించాం. వైస్‌ఛైర్మన్లుగా ధరణికోట శ్రీలక్ష్మి, శ్రీనివాస్ చుట్టుకుదురును ప్రతిపాదించాం.ఎంత ప్రలోభపెట్టినా మా కౌన్సిలర్లు తప్పుకోలేదు. తెదేపా తరఫున 15 మంది కౌన్సిలర్లు భయపడలేదు. నా ఓటు కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు నిర్ణయం తుది నిర్ణయం. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం. -కేశినేని నాని, ఎంపీ
ఛైర్మన్ ఎవరైనా సహకరిస్తా..
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని వైకాపా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తెలిపారు. తెదేపాకు 16వ ఓటు చెల్లదని తాము తెలిపామన్నారు. కోర్టుకు సీల్డ్ కవర్లో సమాచారం పంపుతున్నారని.. ఏ పాలక వర్గం ఏర్పడినా తన వంతు సహకారం ఉంటుందన్నారు. కొండపల్లికి ఎవరు ఛైర్మన్ అయినా.. ఎమ్మెల్యేగా తాను సహకరిస్తానన్నారు. ఛైర్మన్ ఎన్నికపై అంతిమ నిర్ణయం కోర్టుదేనన్నారు.
హైకోర్టు ఆగ్రహం...
వైకాపా నేతల వీరంగంతో రెండుసార్లు వాయిదా పడిన కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక(kondapalli municipal chairman,vice chairman election) నిన్న (బుధవారం) తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈనెల 22 న నిర్వహించాల్సిన ఎన్నికను రిటర్నింగ్ అధికారి రెండుసార్లు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ తెదేపా కౌన్సిలర్లు, ఓ స్వతంత్ర అభ్యర్థి, తెదేపా ఎంపీ కేశినేని నాని దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. కోరం ఉన్నప్పుడు ఎన్నికను వాయిదా వేయడానికి వీల్లేదని.. వైకాపా కౌన్సిలర్లు అవరోధం కల్పిస్తున్నారనే కారణంతో రిటర్నింగ్ అధికారి ఎన్నికను వాయిదా వేశారని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఆర్వో శివనారాయణరెడ్డి తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారంనాటి విచారణకు అత్యవసరంగా పిలిపించిన ధర్మాసనం ఆర్వోకు పలు ప్రశ్నలు సంధించింది. అడ్డుకుంటున్నారని ఎన్నిసార్లు ఎన్నికను వాయిదా వేస్తారని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇంకోదానికి అనుమతించబోమని(kondapally municipal elections news) అంటే దానికీ అంగీకరిస్తారా.. అని ఆర్వోపై మండిపడింది.
PENCIL THEFT: పెన్సిల్ దొంగపై కేసు పెట్టండి.. పోలీసులకు బుడతడి అభ్యర్థనఇదీచదవండి.