ETV Bharat / state

శ్రామిక్ పోస్టుకు మహిళ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాలి: హైకోర్టు - ఏపీఎస్ఆర్టీసీలో లింగవివక్షత

ఏపీఎస్​ఆర్టీసీ లాంటి కొన్ని సంస్థలు లింగవివక్షతో కూడిన ఉత్తర్వులిస్తున్నాయని....హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. డ్రైవర్‌గా పనిచేస్తూ మృతి చెందిన తన భర్త స్థానంలో......కారుణ్య నియామకం కల్పించాలన్న మహిళ అభ్యర్థనను తిరస్కరించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. శారీరక సామర్థ్యం పేరుతో కారుణ్య నియామకాన్ని నిరాకరించడం వివేకం లేని పని అని అభిప్రాయపడింది. 2003లో సంస్థ ఎండీ ఇచ్చిన సర్క్యులర్‌ను రద్దు చేసింది.

శ్రామిక్ పోస్టుకు మహిళ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాలి: హైకోర్టు

author img

By

Published : Mar 12, 2021, 4:36 AM IST

Updated : Mar 12, 2021, 6:21 AM IST

డ్రైవర్‌గా పనిచేస్తున్న తన భర్త సర్వీసులో ఉండగా మృతి చెందిన కారణంగా.......కారుణ్య నియామకం కింద కండక్టర్ లేదా తగిన పోస్టు కల్పించాలన్న మహిళ అభ్యర్థనను...ఏపీఎస్ఆర్టీసీ తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. 2003 మే 26న ఆర్థిక ఎండీ ఇచ్చిన సర్క్యలర్ ప్రకారం మహిళలు శ్రామిక్ పోస్టుకు అనర్హులంటూ ఆర్టీసీ ఇచ్చిన సమాధానంపై అభ్యంతరం తెలిపింది. ఆ సర్క్యలర్ మహిళల పట్ల వివక్ష చూపేదిగా ఉందంటూ రద్దు చేసింది. తన భర్త ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తూ 2007 ఫిబ్రవరి 16న కన్ను మూశారని....తనకు కారుణ్య నియామకం కింద కండక్టర్, అటెండర్, శ్రామిక్ లేదా తగిన పోస్టు కల్పించాలని......కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీ దరఖాస్తు చేసుకున్నారు. ఆర్టీసీ అధికారులు ఆమె అభ్యర్థనను తిరస్కరించడంతో...కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ కండక్టర్ పోస్టుకు అవసరమైన ఎత్తు లేరని....మినహాయింపునకు అధికారులు ఒప్పుకోలేదని....ఆర్టీసీ తరఫు న్యాయవాది వాదించారు. అటెండర్ పోస్టుకు నియామకాలు చేపట్టడం లేదని వివరించారు. 2003 మే 26 ఆర్టీసీ వైస్ ఛైర్మన్, ఎండీ ఇచ్చిన సర్క్యలర్ ప్రకారం మహిళలు శ్రామిక్ పోస్టుకు అనర్హులన్నారు.

శ్రామిక్ పోస్టుకు మహిళ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాలి: హైకోర్టు

ఆర్టీసీ తరఫు న్యాయవాది వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. మృతి చెందిన ఉద్యోగి కుటుంబీకుల కారుణ్య అభ్యర్థనను మొదట్లో గ్రేడ్-1 డ్రైవర్, గ్రేడ్-2 కండక్టర్, శ్రామిక్ పోస్టులకు పరిగణనలోకి తీసుకునేవారని గుర్తుచేసింది. 2003లో ఆర్టీసీ ఎండీ ఇచ్చిన సర్క్యలర్ నేపథ్యంలో.....శ్రామిక్, మెకానిక్, ఛార్జిమెన్ పోస్టులను కేవలం పురుషులకే కల్పించారని తెలిపింది. శ్రామిక్ పోస్టుల భర్తీకి మహిళలను మినహాయిస్తూ సంస్థ ఎండీ ఇచ్చిన సర్క్యలర్ వివక్ష చూపేదిగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అది అధికరణ 14, 15లను ఉల్లంఘిస్తోందని చెప్పడానికి సందేహించడం లేదని తేల్చి చెప్పింది. మతం, జాతి, కులం, లింగభేదం, పుట్టుక, ప్రాంతం ఆధారంగా వివక్షను అధికరణ 15 నిరోధిస్తోందన్నారు. అందువల్ల....2003లో సంస్థ ఎండీ ఇచ్చిన సర్య్యలర్‌ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ రద్దు చేస్తున్నామని స్పష్టం చేసింది. పిటిషనర్ లక్ష్మీని కారుణ్య నియామకం కింద శ్రామిక్, లేదా తగిన పోస్టులో నియమించే అంశంపై....6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది.

ఇవీ చదవండి

వైభవంగా మహాశివరాత్రి వేడుకలు... భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రాలు

Last Updated : Mar 12, 2021, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.