ప్రజా సమస్యల సత్వర పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి.. సామాన్యులే కాదు.. ప్రముఖులూ వస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి.. సినీ నటుడు వడ్డే నవీన్ వచ్చారు. భూ సేకరణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న తమ భూమికి.. పరిహారం చెల్లించాలంటూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. నూజివీడు పరిధిలోని తిరువూరు నియోజకవర్గం మాధవరం గ్రామంలో తన తల్లికి భూమి ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చారు. ఇంతవరకూ పరిహారం అందలేదన్నారు.
ఇదీ చూడండి: