కోవిడ్-19 వ్యాధి నిర్ధరణ, చికిత్సకు సంబంధించి అందుబాటులో ఉన్న వసతులపై ప్రజలకు సమాచారం అందించేందుకు ప్రభుత్వం హెల్ప్‌లైన్ నెంబర్ 8297104104ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబరుకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. ఐవీఆర్ఎస్ విధానంలో పనిచేసే ఈ హెల్ప్‌లైన్ నెంబరుకు ఫోన్ చేసినప్పుడు 3 ఐచ్ఛికాలను ( ఆప్షన్లు) సూచిస్తుంది.
- కోవిడ్ సంబంధిత సమాచారం తెలుసుకోవడానికి 1, వైద్య సహాయం కోసం 2, సంబంధిత సమాచార సాధనాల కోసం తెలుసుకోవడానికి 3 నొక్కమని సూచిస్తుంది. మళ్లీ ప్రతి కేటగిరిలోనూ నిర్దిష్ట సమాచారం కోసం మీ ఫోన్లోని డయల్ప్యాడ్లో వేర్వేరు నంబర్లు నొక్కాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆప్షన్ 1 ఎంచుకుంటే మళ్లీ దానిలో కరోనా లక్షణాలు కలిగి ఉన్నవారు ఏం చేయాలో తెలుసుకోవడానికి 1 కరోనా పరీక్ష చేయించుకోవడానికి ఎవరిని సంప్రదించాలో తెలుసుకోవడానికి 2, పాజిటివ్ వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉండటానికి ఏం చేయాలన్నదానికి 3..ఇలా వేర్వేరు నెంబర్లు నొక్కాల్సి ఉంటుంది.
- రెండో ఐచ్ఛికం ఎంచుకున్నప్పుడు పాజిటివ్ వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉండలానుకున్నవారు ఏం చేయాలి ? పాజిటివ్ వచ్చి కోవిడ్ సెంటర్లలో లేదా ఆసుపత్రులో చేరాలంటే ఏం చేయాలి? అంబులెన్స్‌లో కోసం ఎవరిని సంప్రదించాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి వంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
- మూడో ఐచ్ఛికంలో మొబైల్ యాప్, వాట్సాప్ చాట్ ,బాట్, కోవిడ్ వెబ్సైట్ , టెలిమెడిసిన్, 104 కాల్ సెంటర్ల వివరాలు తెలుసుకోవచ్చు.
ఇదీ చూడండి. నక్సలైట్లలో చేరాలనుకుంటే చేరవచ్చు కదా: మంత్రి విశ్వరూప్