తెలంగాణలో జోరుగా వర్షాలు పడుతున్న కారణంగా.. మున్నేరుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నందిగామ, కీసర మీదుగా మున్నేరు నీరు కృష్ణా నదిలో కలుస్తోంది. సకాలంలో నీరు రావటం వల్ల మున్నేరు కాల్వలకు సాగునీరు విడుదల చేశారు.
పెనుగంచిప్రోలు, వత్సవాయి, నందిగామ మండలాల పరిధిలోని 18 వేల ఎకరాల్లో వరి సాగుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నారుమడులు పోసిన రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు నందిగామ మండలం చందూపురం వద్ద నల్లవాగుకు భారీగా వరద నీరు వస్తుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: