విజయవాడలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నగరం లోపల, బయట వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించారు. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆటోలు ఇతర ప్రైవేటు వాహనాలు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. 31 వరకు ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. విజయవాడ బస్టాండ్‌లో బస్సులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయడంతో పాటు... కరోనా సోకిన వ్యక్తి నివాసం పరిసరాలను ప్రత్యేక జోన్‌గా ప్రకటించినట్లు వెల్లడించారు. రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులను అడ్డుకుంటున్నారు. ఇప్పటికే విజయవాడ పండింట్ నెహ్రూ బస్‌స్టేషన్ వెలవెలబోతుంది.
ఇదీ చూడండి మన నుడి.. మన నది: రెండూ.. రెండు కళ్లు!