ETV Bharat / state

ఉద్ధృతంగా కృష్ణమ్మ.. నీటమునిగిన పంటలు, గ్రామాలు - heavy flow in krishna river -submerged crops, villages

కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. వరద ధాటికి గ్రామాలు నీట మునిగాయి. పంట పొలాలు, ఉద్యానవన పంటల్లోకి వరద వచ్చి చేరింది. అప్రమత్తమైన అధికారులు పునరావాస, సహాయక చర్యలు చేపట్టారు.

Dharna to solve the problems of construction workers
ఉధృతంగా కృష్ణమ్మ-నీటమునిగిన పంటలు, గ్రామాలు
author img

By

Published : Sep 29, 2020, 12:34 AM IST

కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. వరద ప్రవాహానికి నందిగామలో ఏటిపట్టు గ్రామాలు విలవిలాడుతున్నాయి. గనిఆతుకూరు గ్రామం రెండుగా చీలిపోయింది. కావేజ్ పైకి వరద నీరు చేరడంతో గ్రామస్థులు నడుములోతు నీటిలో నడక సాగిస్తున్నారు. తోట్లవల్లూరు మండలం పరధిలో వరద గంటగంటకూ పెరుగుతోంది. తోడేళ్ళుదిబ్బ, పాములలంక, పొట్టిదిబ్బ లంక, పిల్లివాని లంక, తుమ్మలపిచ్చి లంక గ్రామాలను కృష్ణా వరద నీరు చుట్టుముట్టింది.

చాలా ప్రాంతాల్లో పసుపు ,కంద, చెరుకు, తమలపాకు, మినుము, అరటి పంటల్లోకి వరదనీరు చేరింది. అప్రమత్తమైన అధికారులు తోట్లవల్లూరు, చాగంటిపాడు, భద్రిరాజుపాలెంలలో 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

గతేడాది వరదల పరిహారమే ఇంతవరకూ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదని.. మళ్లీ ఈ ఏడాది కూడా పంటలు మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గత ఏడాది రావలసిన పరిహారం అందజేయాలని వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

కొండవీటి వాగు లిఫ్ట్​తో నీటి ఎత్తిపోత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.