ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ర్యాండమ్ టెస్టుల నిర్వహణకు సిద్ధం - ఆంధ్రప్రదేశ్​లో కరోనా వైరస్​ ర్యాండమ్ టెస్టులు

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్​ ర్యాండమ్ టెస్టులు నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. ఇళ్ల వద్దకే వెళ్లి కరోనా వైరస్ పరీక్షలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

health department gets ready for random testing of corona in the state
కరోనా వైరస్​ ర్యాండమ్ టెస్టుల నిర్వహణకు వైద్యారోగ్యశాఖ సిద్ధం
author img

By

Published : Apr 16, 2020, 12:05 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ర్యాండమ్ టెస్టులు నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. రెడ్‌జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలు, కంటైన్మెంటు క్లస్టర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో నమూనాల సేకరణను పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న టెస్టుల సంఖ్య వెయ్యికి పెంచిన ప్రభుత్వం... ట్రూనాట్ మెషీన్లు అందుబాటులోకి రావటంతో విస్తృతంగా నిర్ధరణ పరీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. అనుమానితులు ఎవరైనా ఉంటే వారి వివరాలను తెలియజేసి... ధైర్యంగా నమూనాలు ఇచ్చి వైద్య పరీక్షలకు సహకరించాలని పిలుపునిచ్చింది. పరీక్షల అనంతరం క్వారంటైన్‌కు తక్షణమే తరలించే అవకాశం లేదని... వైద్యులే వచ్చి ఉచితంగా మందులు ఇస్తారని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. వైఎస్ఆర్ టెలీమెడిసిన్ అందుబాటులోకి రావడంతో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం తెలియచేసింది.

ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలో తుది దశకు చేరిన 'కరోనా' సర్వే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.