కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని తాళ్లమూడికి చెందిన నడుకుదురు శ్రీనివాస్ (19) పాపికొండలు విహారయాత్రలో భాగంగా... తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో బోటు మునిగి గల్లంతయ్యాడు. ఇప్పటివరకూ అతని ఆచూకీ తెలియలేదు. పడవ మునిగే ముందు ఉత్సాహంగా డాన్సులు చేశాడు. అ వీడియోలు తన మిత్రులకు పంపించాడు. ఆ వీడియోల్లో ఉత్సాహంగా నృత్యం చేస్తూ కనిపించాడు శ్రీనివాస్. ఆ వీడియోలు చూస్తూ... అతని బంధువులు, స్నేహితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.
ఇదీ చదవండీ... ప్రమాదానికి కారణమైన అందరిపైనా చర్యలు: డీజీపీ