వైఎస్‌ఆర్ చేయూత పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీలకు చెందిన 45నుంచి 60ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. నాలుగు విడతల్లో, నాలుగేళ్లలో రూ.75వేల రూపాయల సాయం అందిస్తారు. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే..
- గ్రామీణ మహిళలకు కుటుంబ ఆదాయం రూ.10వేలకు, పట్టణ ప్రాంతాల వారికి రూ.12 వేలకు మించకూడదు.
- కుటుంబానికి మూడెకరాల కంటే ఎక్కువ సాగు భూమి ఉండకూడదు.
- పదిఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉండకూడదు.
- ప్రభుత్వ ఉద్యోగులు, పింఛను పొందే విశ్రాంత ఉద్యోగులు ఉండరాదు.
- 4 చక్రాల వాహనం ఉంటే పథకం వర్తించదు. (ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు)
- నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించకూడదు.
ఇదీ చూడండి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్