ETV Bharat / state

సీఎస్‌ పేరుతో గ్రూప్‌-1 అధికారి మోసాలు

ఒకవైపు అనారోగ్యం.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు.. వెరసి కష్టాలు చుట్టుముట్టడంతో డబ్బు కోసం ఓ గ్రూప్‌-1 అధికారి మోసాల బాట పట్టి చివరకు పోలీసులకు దొరికాడు.

group 1 officer cheating
సీఎస్‌ పేరుతో గ్రూప్‌-1 అధికారి మోసాలు
author img

By

Published : Jan 29, 2021, 8:40 AM IST

తాను ఐఏఎస్‌ అధికారినని చెప్పుకొంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో నకిలీ నియామక పత్రాలు ఇచ్చిన కేసులో విజయవాడ కృష్ణలంక పోలీసులు సురేంద్ర కుమార్‌ను గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడ వించిపేటకు చెందిన రియాజ్‌ ఏలూరులో రోడ్డులోని ఓ సెల్‌షాపులో పని చేస్తున్నాడు. ఆయనకు ఐఏఎస్‌ అధికారిని అని చెప్పి సురేంద్ర పరిచయం అయ్యాడు. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని, కరోనా నేపథ్యంలో వాటికి ప్రకటన ఇవ్వలేదని, బ్యాక్‌లాగ్‌ కింద భర్తీ చేస్తున్నారని రియాజ్‌ను నమ్మించాడు. దీంతో.. సురేంద్రను కలవాల్సిందిగా నిరుద్యోగి అయిన తన మేనల్లుడు సైఫుద్దీన్‌కు రియాజ్‌ చెప్పారు. అలా కలిసినప్పుడు రవాణాశాఖలో ఎంవీఐ ఉద్యోగం ఉందని, దానికి రూ. 2 లక్షలు ఖర్చవుతుందని సురేంద్ర చెప్పాడు. ఈ నెల 25న నియామకపత్రం ఇచ్చి, గురువారం విధుల్లో చేరాలన్నాడు. గురువారం ఉదయం ఫోన్‌చేసి, అత్యవసరంగా రూ.82 వేలు ఇవ్వాలని, మిగిలింది విధుల్లో చేరాక ఇవ్వచ్చని చెప్పాడు. దాంతో సైఫుద్దీన్‌ అప్పుచేసి డబ్బు తీసుకొని.. ఉండవల్లిలో సురేంద్రను కలిసి ఇచ్చారు. తర్వాత నియామకపత్రంతో విజయవాడలో డీటీసీ పురేంద్రను కలవగా.. ఆయన దాన్ని నకిలీ ఉత్తర్వుగా తేల్చారు. దీంతో సైఫుద్దీన్‌ రవాణాశాఖ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లగా, ఉత్తర్వులు నకిలీవేనని అధికారులు తేల్చి, పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాంతో సురేంద్ర ఇంటిపై నిఘాపెట్టిన పోలీసులు.. గురువారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

1996 బ్యాచ్‌ గ్రూప్‌-1 అధికారినైన తాను సహకార శాఖలో రిజిస్ట్రార్‌గా పనిచేశానని సురేంద్ర విచారణలో వెల్లడించాడు. అనారోగ్యంతో రెండేళ్లుగా సెలవులో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో మోసాలు చేయడం ప్రారంభించినట్లు పోలీసులు చెప్పారు. పదిమంది వరకు ఎంపికైనట్లు నియామక పత్రంలో ఉంది. మిగిలినవారూ ఇలా మోసపోయారా లేదా అన్న విషయం దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: పోలీసు అసోసియేషన్ సభ్యులతో డీజీపీ చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.