కృష్ణాజిల్లా జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో తలపెట్టిన సమగ్ర వ్యవసాయ పరిశోధనా శాలకు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, కేడీసీసీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరు అందించే కృష్ణా ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక నిపుణులకు అప్పగించారని అన్నారు. రైతుభరోసా కేంద్రాలు, ప్రయోగశాలలతో అన్నదాతలకు వ్యవసాయం పండుగగా మారుతుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి చేనేత కార్మికులకు లాక్డౌన్ కష్టాలు