ETV Bharat / state

'నైపుణ్య అభివృద్ధిలో మార్పులకు ప్రభుత్వ మార్గదర్శకాలు' - ఏపీలో నైపుణ్యాభివృద్ధి కోర్సులు

రాష్ట్రంలో నిర్వహిస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కోర్సులు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న కోర్సుల ప్రమాణాలకు అనుగుణంగా ఉండేట్టు మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో అందించే శిక్షణ, పరిశీలన, సర్టిఫికేషన్ వంటి అంశాలు స్కిల్ ఇండియా పోర్టల్ అనుగుణంగానే ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్యాచరణ ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Govt guidelines for skill development
ప్రభుత్వ లోగో
author img

By

Published : May 19, 2020, 9:50 PM IST

రాష్ట్రంలో నిర్వహిస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కోర్సులు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న కోర్సుల ప్రమాణాలకు అనుగుణంగా ఉండేట్టు మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ సహా వివిధ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి జాతీయస్థాయిలో నిర్దేశించిన ప్రామాణికాలను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ఏజెన్సీల ద్వారా ఇచ్చే నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రమాణాలను ఏపీ స్కిల్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ నిర్దేశిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ అనుగుణంగా ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. సాంఘిక, గిరిజన సంక్షేమం, కళాశాల, ఉన్నత విద్యా విభాగాల ద్వారా అందించే నైపుణ్య శిక్షణలోనూ ప్రమాణాలను ఏపీ స్కిల్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ నిర్దేశిస్తుందని వెల్లడించింది. రాష్ట్రంలో అందించే శిక్షణ, పరిశీలన, సర్టిఫికేషన్ వంటి అంశాలు స్కిల్ ఇండియా పోర్టల్ అనుగుణంగానే ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్యాచరణ ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీచూడండి. విజయవాడ రానున్న 3 ప్రత్యేక విమానాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.